దుబాయిలో దేవర డిస్ట్రిబ్యూటర్ల సందడి
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటించిన దేవర చిత్రం ఈ దసరా పండుగ సీజన్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఏపీ, తెలంగాణలలోని డిస్ట్రిబ్యూటర్లను తెలుగు రైట్స్ ఓనర్ నాగవంశీ దుబాయ్‌కు తీసుకువెళ్లారు. వారందరికీ అక్కడ బ్రహ్మాండమైన పార్టీ ఎరేంజ్ చేసి సెలబ్రేషన్లు చేసుకున్నారు. ఈ చిత్రం ఇప్పటికే రూ. 500 కోట్లుకు పైగా వసూళ్లు రాబట్టింది.