Home Page SliderNational

యాసిడ్ దాడిలో చూపు కోల్పోయినప్పటికీ..స్కూల్ టాపర్‌గా సత్తా చాటిన విద్యార్థిని

అంగవైకల్యం అనేది మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏమాత్రం అడ్డురాదని  యాసిడ్ దాడిలో చూపు కోల్పోయిన బాలిక నిరూపించింది. లక్ష్యాన్ని ఎలాగైనా చేరుకోవాలనే కసి,తపన మనలో ఉన్నప్పుడు అంగవైకల్యం కూడా దాని ముందు చిన్నబోతుందని ఛండీఘడ్‌కు చెందిన 15 ఏళ్ల కాఫీ సమాజానికి చాటి చెప్పింది. యాసిడ్ దాడికి గురై చూపు కోల్పోయిన కాఫీ ఆత్మ విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. కాగా చిన్నప్పటి నుంచి చదువుపై మక్కువతో ఉండే కాఫీ ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ 10 వ తరగతి ఫలితాల్లో సత్తా చాటింది. ఏకంగా 95.2% మార్కులను సాధించి స్కూల్ టాపర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా కాఫీ తండ్రి మాట్లాడుతూ.. తమ కుమార్తెకు 3 ఏళ్లు ఉన్నప్పుడు పక్కింటి వ్యక్తి తనపై యాసిడ్ దాడికి పాల్పడినట్లు  తెలిపారు. కాగా ఈ దాడిలో కాఫీ చూపు కోల్పోయిందని ఆయన వెల్లడించారు. ఆరేళ్లపాటు తనను ఎన్ని ఆసుపత్రుల చుట్టూ తిప్పినా ఫలితం లేకుండా పోయిందన్నారు. అయినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందని కాఫీ ఎన్నో పోరాటాలను దాటుకుని ఈ విజయాన్ని సాధించిదన్నారు. అయితే కాఫీ ఐఏఎస్ కావాలని కోరుకుంటుందన్నారు. తమ పిల్లలు లక్ష్యాన్ని సాధించడానికి తల్లిదండ్రులే వారికి పూర్తి సహకారం అందించాలని సచివాలయంలో ప్యూన్‌గా పనిచేస్తున్న కాఫీ తండ్రి  పవన్ వెల్లడించారు.