“ప్రమాదం గురించి ముందే హెచ్చరించినా..కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదు”:అమిత్ షా
కేరళలోని వయనాడ్‌లో కొండ చరియలు విరిగి పడడంతో 163 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని ఈ నెల 23నే కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు అమిత్ షా తెలిపారు. అయినప్పటికీ కేరళ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన మండిపడ్డారు.అయితే అప్పుడే కేరళ ప్రభుత్వం అప్రమత్తమై జాగ్రత్త పడి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదన్నారు. కాగా విపత్తును పసిగట్టే అత్యాధునిక వ్యవస్థను భారత్ కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు.

