‘ఈ విషయం ఆశ్చర్యం కలిగించింది’..మిస్ వరల్డ్
మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిస్కోవా భారత్ తనకెంతో నచ్చిందని, ప్రజలు చాలా గొప్పగా స్వాగతం పలికారని పేర్కొన్నారు. మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్న కారణంగా ఆమె హైదరాబాద్‌కు వచ్చారు. పోటీల నిర్వహణ ఏర్పాట్లపై నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, భారతదేశంపై ప్రశంసలు కురిపించారు. ఈ దేశంలో ఇన్ని భాషలు ఉన్నా, అందరూ ఒకటిగా ఉండడం తనకెంతో ఆశ్చర్యం కలిగించిందన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది ఎంతో గొప్ప భావన అని పేర్కొన్నారు. 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ వేదిక కానుంది. మే నెలలో హైదరాబాద్ లో పోటీలు ప్రారంభం కానున్నాయి.