ఏపీ సీఎంతో డిప్యూటీ సీఎం భేటీ
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా భేటీ అయ్యారు. కాగా వీరిద్దరు నామినేటెడ్ పదవులు,కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నామినేటెడ్ పోస్టుల కేటాయింపుపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు పార్టీలో కష్టపడిన వారందరిని గుర్తించి సముచిత స్థానం కల్పిస్తామని ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.