ఏపీలో త్రాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై డిప్యూటీ సీఎం ఫోకస్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఏపీలోని జలమండలి అధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన రాష్ట్రంలో అతిసారం కేసులు పెరుగుతున్నాయన్నారు. వీటిని అరికట్టేందుకు నీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. కాగా మంచి నీటి సౌకర్యంలేని గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని డిప్యూటీ సీఎం సూచించారు. అయితే గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ లాంటి కేంద్ర నిధులను సక్రమంగా వాడుకోలేకపోయిందన్నారు. ఇకపై వాటిని సద్వినియోగం చేసుకోవాలని పవన్ తెలిపారు. ఈ మేరకు ఈ పథకం అమలు,నిధుల వివరాలు అందించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు.

