ఖమ్మంలో ఉపముఖ్యమంత్రి
ఖమ్మంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా ప్రజా ప్రతినిధులు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వేడుకలకు హాజరైన ప్రజా ప్రతినిధులకు, అధికారులకు విద్యార్థిని విద్యార్థులకు ప్రజలకు అభివాదం చేశారు.