ఒరిస్సాకు ఉప ముఖ్యమంత్రి భట్టి ప్రయాణం..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒరిస్సా పర్యటన ఖరారు అయింది. ఒరిస్సా ముఖ్యమంత్రితో నేడు ఆయన భేటీ కానున్నారు. ఒరిస్సాలో సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టనున్న నైని బొగ్గు బ్లాక్ తవ్వకాలకు కావలసిన అనుమతుల గురించి ఒరిస్సా ముఖ్యమంత్రితో భట్టి చర్చించనున్నారు. ఒరిస్సా నైని బొగ్గు బ్లాక్ అనుమతులు సాధిస్తే సింగరేణికి మరింత ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.

