Home Page SliderNational

డెమోంటే కాలనీ 3 (2026) రాబోతోంది..

హార్రర్‌ జోనర్‌లో రాబోతున్న సీక్వెల్ ప్రాజెక్ట్‌ ‘డెమోంటే కాలనీ 2′. 2015లో విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని అందుకుంది. డెమోంటే కాలనీకి కంటిన్యూ వెర్షన్‌గా వస్తోన్నీ చిత్రానికి ఆర్ అజయ్ జ్ఞానముత్తు ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. అరుల్ నిధి లీడ్ రోల్‌లో నటించగా.. ప్రియా భవానీ శంకర్  ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ మూవీ ఆగస్టు 23న థియేటర్లలో సందడి చేయనుంది. డెమోంటే కాలనీ 2ను తెలుగులో పాపులర్ ప్రొడక్షన్‌ హౌస్‌ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తోంది. రిలీజ్‌ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రమోషనల్ ఈవెంట్‌లో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రానికి థర్డ్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌ డెమోంటే కాలనీ 3 కూడా వస్తుందని, అది కూడా ఎంతో దూరంలో లేదని, త్వరలో ప్రేక్షక దేవుళ్లు వీక్షించవచ్చు అని ప్రకటించారు‌. అంతేకాదు మూడో పార్ట్‌ 2026లో విడుదల కానుందని తెలియజేశారు. సీక్వెల్‌ విడుదలకు ముందే మూడో పార్ట్‌ను కూడా ప్రకటించారు. సీక్వెల్‌లో అరుణ్‌పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవిందరాజన్, అర్చన రవిచంద్రన్ తదితరులు కీల‌క పాత్రలు పోషించారు. ఇప్ప‌టికే లాంచ్ చేసిన ఫ‌స్ట్ లుక్‌తోపాటు టీజ‌ర్‌కు మంచి స్పందన లభిస్తోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగుతున్న ట్రైల‌ర్ సినిమాపై సూపర్ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది.