Andhra PradeshHome Page Slider

ఏపీలో వైసీపీ కార్యాలయం కూల్చివేత

ఏపీలోని తాడేపల్లిలో నీటిపారుదల శాఖకు చెందిన 2 ఎకరాల్లో వైసీపీ కేంద్ర కార్యాలయన్ని నిర్మిస్తోంది. అయితే ఈ కార్యాలయాన్ని ఇవాళ CRDA అధికారులు కూల్చేశారు.కాగా దీన్ని వైసీపీ పార్టీ తక్కువ మొత్తానికి 90 ఏళ్లకు లీజుకు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ కార్యాలయ నిర్మాణం నిబంధనల మేరకు జరగడం లేదని గతంలో వైసీపీకి  CRDA అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే దీనిపై వైసీపీ హైకోర్టుకు వెళ్లింది. దీంతో చట్టప్రకారం నడుచుకోవాలని CRDAను ధర్మాసనం ఆదేశించింది. కాగా దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ తమకింకా అందలేదని అధికారులు వైసీపీ కార్యాలయాన్ని కూల్చేశారు.