చిత్రపురి కాలనీలో ఏడు విల్లాల కూల్చివేత
అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝలిపిస్తోంది. తాజాగా నేడు మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనీలో లో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన 7 విల్లాలను కూల్చి వేశారు. 220 విల్లాలకు మాత్రమే అనుమతులు పొంది, మరో ఏడు విల్లాలను అక్రమంగా కూల్చివేశారని సమాచారం. ఈ ఘటనపై మున్సిపాలిటీ అధికారులు, సొసైటీ సభ్యుల మధ్య వాగ్వాదాలు జరిగాయి. ఈ విల్లాలను భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేశారు. చెరువులను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి విల్లాలు, అపార్టుమెంట్‌లు నిర్మించారని, గత ప్రభుత్వ ఒత్తిడుల కారణంగా అధికారులు చర్యలు తీసుకోలేకపోయారని పేర్కొన్నారు. ఇప్పుడు చాలా చోట్ల ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని కాలనీల సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో సొసైటీకి దాదాపు రూ.50 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని సమాచారం.

