మాజీ సీఎం జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని ఏపీ మాజీ సీఎం జగన్ నివాసంలోని అక్రమ నిర్మాణాలను GHMC అధికారులు కూల్చివేశారు. కాగా జేసీబీలతో GHMC అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అయితే భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఏపీ మాజీ సీఎం ఇంటివద్ద నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. కాగా స్థానికుల ఫిర్యాదుల మేరకు వాటిని కూల్చి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో జగన్ భద్రత కోసం రోడ్లను ఆక్రమించి గదుల నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ అక్రమ నిర్మాణాలతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో GHMC అధికారులు జగన్‌కు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ ఎవరు స్పందించకపోవడంతో GHMC అధికారులు ఈ రోజు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.