“ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తే వచ్చేది కాదు”:జీవీఎల్
ఏపీ మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహరావు విమర్శలు గుప్పించారు.ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తే వచ్చేది కాదన్నారు. ప్రజల పక్షాన పోరాడటానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. కాగా ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ అనడాన్ని ఆయన తప్పు బట్టారు. అయితే డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఏపీకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని జీవీఎల్ స్పష్టం చేశారు.

