కోల్‌కతా రేప్-హత్య కేసులో ‘ఉరిశిక్ష’కై అనుపమ్ ఖేర్’ డిమాండ్..
శుక్రవారం, కరణ్ జోహార్, అనుపమ్ ఖేర్‌తో సహా పలువురు ప్రముఖులు కోల్‌కతా అత్యాచారం – హత్య కేసు, అమానుషం పట్ల తమ దిగ్భ్రాంతి, అసహ్యాన్ని వ్యక్తబరిచారు. కోల్‌కతా డాక్టర్ రేప్ – మర్డర్ కేసుపై చిత్ర నిర్మాత కరణ్ జోహార్ తన నిరాశ, నిస్పృహను వ్యక్తం చేశారు. భారతదేశంలో మహిళల భద్రతపై తనకు అసహ్యం కలుగుతోందని చెబుతూ దర్శకుడు తన ఇన్‌స్టాగ్రామ్ కథనాలలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. గత కొంతకాలంగా ఈ కేసుపై వ్యాఖ్యానించేందుకు ప్రయత్నిస్తున్నానని, చివరకు మాట్లాడే ధైర్యం రాక ఇలా ఒక నోట్‌లో రాశారు. ఈ కేసు మన దేశంలో జరిగే అతిపెద్ద వైఫల్యాలలో ఒకటిగా ఎలా సూచిస్తుందో, అది “ప్రతిఫలాలను” కలిగిస్తుందని కరణ్ రాశారు. స్వాతంత్య్ర దేశంలో మహిళలకు ఇంకా స్వేచ్ఛ లభించక 78 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడం విడ్డూరం, హాస్యాస్పదమని ఆయన అన్నారు.
“గత కొన్ని రోజులుగా, నేను ఈ అమానుషమైన, క్షమించరాని నేరం గురించి నా ఆలోచనలను వ్యక్తీకరించడానికి ప్రయత్నిస్తున్నాను… మహిళలను రక్షించడంలో మానవుడు అతిపెద్ద తప్పులు చేస్తున్నాడు… నాకు ఇంకా పదాలు ఎలా వాడాలో బోధపడడం లేదు… ఎలా ఈ దారుణాన్ని వర్ణించాలో… మాటలు ముఖ్యం కానీ చర్యలు తప్పవు అంటూ, న్యాయాన్ని కఠినంగా అమలుపరచకపోతే ఇదే మా సమాధానం అని ప్రజలు అంటే కానీ అధికారులు మేల్కోరు.