Home Page Sliderhome page sliderNational

కస్టమర్‌పై డెలివరీ బాయ్‌ పిడిగుద్దులు..

సరుకులు డెలవరీ చేయడానికి వెళ్లిన జెప్టో డెలివరీ బాయ్ కస్టమర్‌పై దాడికి పాల్పడ్డాడు. అడ్రస్ తప్పుగా పెట్టారంటూ కస్టమర్ తో గొడవకు దిగాడు. మాటామాట పెరగడంతో కస్టమర్ పై డెలివరీ బాయ్ పిడిగుద్దులు కురిపించాడు. దీంతో కస్టమర్ కంటి వద్ద తీవ్ర గాయమైంది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరు బసవేశ్వర నగర్ లో జరిగింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. డెలివరీ బాయ్ పై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.