Home Page SliderNational

ఐఫోన్ కోసం డెలివరీ బాయ్ హత్య

యువత చిన్నచిన్న ఆనందాల కోసం హత్యలు కూడా చేసే స్థాయికి ఎదిగిపోయారు. ఐఫోన్ పిచ్చితో ఒక యువకుడు డెలివరీబాయ్‌ని చంపేసిన ఘటన యూపీలోని చిన్‌హాట్‌లో జరిగింది. గజానన్ అనే యువకుడు ఫ్లిప్‌కార్ట్‌లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్(   ఎంచుకుని ఐఫోన్‌ను ఆర్డర్ చేశారు. ఆర్డర్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్‌కి డబ్బు ఇవ్వకుండా తన స్నేహితులతో కలిసి చచ్చేలా కొట్టాడు. చివరికి డెలివరీ బాయ్ భరత్ సాహు శవాన్ని కాలువలో పడేశాడు. భరత్ సాహు  కుటుంబం అతడు కనిపించడం లేదని మిస్సింగ్ కేసు పెట్టగా, విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.