ఆతిశీ కి ఢిల్లీ పగ్గాలు..
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిశీని ఎన్నికున్నట్లు ఆప్ వర్గాలు వెల్లడించాయి. తమ శాసనసభాపక్ష నేతగా ఢిల్లీ మంత్రి అతిశీని ఎన్నికచేసినట్లుగా ఢిల్లీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ప్రస్తుత సీఎం కేజ్రీవాల్ రాజీనామాను సమర్పించబోవడంతో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నిక చెేయాలనే ప్రశ్న ఎదురయ్యింది. దీనితో కేజ్రీవాల్ జైలులో ఉండగా, పాలనా వ్యవహారాలు చేపట్టి, బాధ్యతగా నిర్వహించిన ఆతిశీకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని శాసనసభ్యులు నిర్ణయించారు. కేజ్రీవాల్ కూడా ఆమెకే పూర్తి మద్దతు ప్రకటించినట్లు సమాచారం.