కవితకు ఢిల్లీ పోలీసుల షాక్… జంతర్ మంతర్ దీక్షకు అనుమతి నిరాకరణ
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ రేపు జంతర్ మంతర్ వద్ద చేయతలపెట్టిన దీక్షకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. సాంకేతిక కారణాలతో దీక్షకు అనుమితవ్వడం లేదని ప్రకటించారు. దీక్ష, ఈడీ విచారణకు సంబంధించి కవిత మీడియా సమావేశంలో మాట్లాడుతున్నప్పుడే ఢిల్లీ పోలీసుల నుంచి కవితకు సమాచారం అందింది. ఐతే దీక్షకు ముందుగా అనుమతిచ్చి ఇప్పుడు ఎలా నిరాకరిస్తారని కవిత ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు దీక్ష మాత్రం రేపు జంతర్ మంతర్ వద్ద కొనసాగుతుందని స్పష్టం చేశారు.

