Home Page SliderNational

ఢిల్లీ మేయర్ ఎన్నికలు… బీజేపీ వర్సెస్ ఆప్ సభ్యుల కుమ్ములాట

ఢిల్లీ రెండో అతిపెద్ద నిర్ణయాధికార సంస్థ, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) సమావేశంలో AAP, BJP కార్యకర్తలు తోసుకోవడం, కుమ్ములాటలు, నేలపై పడి అరుచుకోవడం లాంటి ఘటనలన్నీ కన్పించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బిజెపికి కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు ఈరోజు ఢిల్లీ మేయర్‌ను ఎన్నుకునే సమావేశంలో గందరగోళం చెలరేగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అరవింద్ కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని నినాదాలు చేస్తూ, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకొని గాయపడ్డారు. లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా నియమించిన తాత్కాలిక స్పీకర్ సత్య శర్మ, మేయర్ ఎన్నికకు ముందు సభకు నామినేటెడ్ సభ్యులు, ఆల్డర్‌మెన్‌లతో ప్రమాణం చేయడంపై నిరసనలు చెలరేగాయి. మనోజ్ కుమార్‌ను ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించడంతో, ఆప్ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు నినాదాలు చేస్తూ మధ్యలోకి చేరుకున్నారు. ఎన్నికైన కౌన్సిలర్లు నామినేటెడ్ సభ్యుల కంటే ముందే ప్రమాణం చేసి ఉండాలని ఆప్ సభ్యులు కోరారు.

ఢిల్లీలోని తమ ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే లెఫ్టినెంట్ గవర్నర్ 10 మంది నామినేటెడ్ సభ్యుల పేర్లను పేర్కొనడంపై ఆప్ గతంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీలో కేంద్రం ప్రతినిధిగా ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర హోం మంత్రికి నివేదించిన ఆప్, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య వరుస ఘర్షణల తరువాత ఈ రచ్చ చోటుచేసుకొంది. వరుసగా మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న తర్వాత డిసెంబర్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీకి సహాయం చేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ మేయర్ ఎన్నికలను వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని AAP ఆరోపించింది. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో కీలక కామెంట్స్ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఉద్దేశ్యపూర్వకంగా బీజేపీకి పొత్తుపెట్టుకున్న 10 మంది నామినేటెడ్ సభ్యులను ఎంపిక చేశారని ఆరోపించారు. నామినేటెడ్ సభ్యుల పేర్లను పేర్కొన్న తర్వాత, సక్సేనా నేటి ఎన్నికలకు అధ్యక్షత వహించడానికి తాత్కాలిక స్పీకర్‌గా BJP కౌన్సిలర్ సత్య శర్మను నియమించారు. సీనియర్ మోస్ట్ కౌన్సిలర్ అయిన ముఖేష్ గోయల్‌ను ఆ పదవికి ఆప్ సిఫార్సు చేసింది. “సభలో అత్యంత సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్ లేదా ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా నామినేట్ చేయడం సంప్రదాయం. కానీ బీజేపీ అన్ని ప్రజాస్వామ్య సంప్రదాయాలు, సంస్థలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ట్వీట్ చేశారు.

మేయర్‌ పదవిని తామే గెలుస్తామని, ఆప్‌కి తమ సొంత కౌన్సిలర్లపై నమ్మకం లేదని బీజేపీ ఎదురుదాడి చేసింది. అంతా రాజ్యాంగం ప్రకారమే జరుగుతోందని.. నైతికంగా ఓడిపోయామని తెలిసి సాకులు చెబుతున్నారని బీజేపీ నేత మనోజ్ తివారీ అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ పార్టీ మేయర్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్‌ను ప్రకటించింది. పదవి కోసం పోరాడబోమని ముందే ప్రకటించిన తర్వాత పదకొండో గంట ఓల్టే ఫేస్‌లో బీజేపీ, రేఖా గుప్తాను నిలబెట్టింది. AAP బ్యాకప్ అభ్యర్థి అషు ఠాకూర్. డిప్యూటీ మేయర్ పదవికి ఆప్‌కి చెందిన ఆలే ముహమ్మద్ ఇక్బాల్, బీజేపీ నుంచి జలజ్ కుమార్, కమల్ బగ్రీ నామినేషన్లు వేశారు. MCD హౌస్‌లో 250 మంది ఎన్నికైన కౌన్సిలర్లు ఉన్నారు. ఢిల్లీ నుంచి బీజేపీకి ఏడుగురు లోక్‌సభ ఎంపీలు, ఆప్‌కి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు, ఢిల్లీ స్పీకర్ నామినేట్ చేసిన 14 మంది ఎమ్మెల్యేలు కూడా మేయర్ ఎన్నికలో పాల్గొంటారు. తొమ్మిది మంది కౌన్సిలర్లు ఉన్న కాంగ్రెస్ ఓటింగ్‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది. గత సంవత్సరం నియోజకవర్గాల పునర్విభజన, MCD విలీనం తర్వాత జరిగిన మొదటి మున్సిపల్ ఎన్నికల్లో 250 వార్డులలో AAP 134 గెలుచుకుంది. బీజేపీ 104 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది.