Home Page SliderNational

కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్

ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ మళ్లీ షాక్ ఇచ్చింది. రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై హైకోర్టు స్టే ఇచ్చింది. ట్రయల్ కోర్టు ఈడీ సమర్పించిన వివరాలను పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమయ్యిందని, బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకునేటప్పుడు పూర్తి స్థాయిలో విచారణ చేయలేదని పేర్కొంది. ఈడీకి విచారణ కోసం తగిన అవకాశం ఇవ్వాలని తేల్చి చెప్పింది. అయితే సుప్రీం కోర్టు కూడా హైకోర్టు తీర్పు వచ్చాకే తాము నిర్ణయం తీసుకోగలమని, అంత వరకూ విచారణ చేయలేమని చెప్పింది. దీనితో రేపు జూన్ 26న సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.