Home Page SliderNationalPolitics

‘గత పదేళ్లుగా ఢిల్లీని ఒక విపత్తు చుట్టుముట్టింది’..మోదీ

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ, ఆమ్ ఆద్మీ పార్టీపై , అధినేత కేజ్రీవాల్‌పై ఘాటు విమర్శలు కురిపించారు. ఢిల్లీని గత పదేళ్లుగా ఒక విపత్తు చుట్టుముట్టిందంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారటీ అధ్వర్యంలో నిర్మించిన పలు నివాస సముదాయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. “మీ ప్రధాని మోదీ తన కోసం ఇల్లు కట్టుకోలేదు. కానీ పదేళ్లలో పేదలకు 4 కోట్ల ఇళ్లను నిర్మించాం. నేను ఢిల్లీ గత ముఖ్యమంత్రిలా అద్దాల మేడలు కట్టుకోలేదు. ప్రజలకు సౌకర్యాలను కల్పించడంలో ఆప్ ప్రభుత్వం విఫలమయ్యింది. వారు బహిరంగంగానే అవినీతికి పాల్పడ్డారు. అందుకే దీనికి ప్రజలు వ్యతిరేకంగా పోరాడాలి” అంటూ పిలుపునిచ్చారు.