NationalNews

కాలుష్య నియంత్రణకు ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం

దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికే కాలుష్యం కారణంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోంటోంది. దేశంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన నగరంగా ఢిల్లీ పేరుగాంచింది. ఈ అత్యధిక జనాభా కలిగిన ఢిల్లీలో కాలుష్యం కూడా అదే రీతిలో ఎక్కువగా ఉంటుంది. ఈ కాలుష్యం కారణంగానే ఢిల్లీలో ఇప్పటికీ కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఈ కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలో రానున్న దీపావళి పండుగపై ఢిల్లీ సర్కార్ ఆంక్షలు విధించింది.   ఈ మేరకు దీపావళి పండుగ సందర్భంగా కాల్చే టపాసులను ఢిల్లీ సర్కార్ నిషేదించింది.  అంతే కాకుండా ఢిల్లీ సర్కార్ క్రాకర్స్ తయారీ, నిల్వ, అమ్మకాలు, కాల్చడం పై నిషేధాజ్ఞలను ఈ ఏడాది చివరి వరకు అమలు చేయనుంది.