‘ఢిల్లీకి రాజధానిగా కొనసాగే అర్హత లేదు’..ఎంపీ
ఢిల్లీ ప్రజలకు ఊపిరి సలపట్లేదు. విపరీతమైన వాయుకాలుష్యంతో నగరం అల్లాడుతోంది. గత వారం రోజులుగా ప్రమాదకర స్థాయిలో ఏఐక్యూ కొనసాగుతోంది. నేటి ఉదయం పలు ప్రాంతాలలో 500కి చేరుకుంది. ఈ విషయంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి పరిస్థితులలో ఢిల్లీకి రాజధానిగా కొనసాగే అర్హత ఉందా అంటూ ప్రశ్నించారు. కాలుష్యనగరాల జాబితాను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ప్రపంచంలోనే అత్యంత కాలుష్యనగరంగా ఢిల్లీ మారిందన్నారు. కొన్నేళ్లుగా ప్రతీ సంవత్సరం నవంబర్ నుండి జనవరి వరకూ ఈ నగరంలో జీవించే పరిస్థితులు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు దీని గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని దేశ రాజధానిగా కొనసాగించాలా? అంటూ ప్రశ్నించారు.