‘ప్రజాస్వామ్యానికే ప్రమాదం ముంచుకొస్తోంది’ ప్రతిపక్షాల ర్యాలీలతో అట్టుడుకిన ఢిల్లీ
ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకు జైలుశిక్ష, ఎంపీగా అనర్హత వేటు, అదానీ వ్యవహారం వంటి అంశాలపై ప్రతిపక్ష పార్టీ ఎంపీలు శుక్రవారం ఆందోళనలకు దిగారు. రాజధాని వీధులలో పార్లమెంట్ నుండి నిరసనలతో ర్యాలీలు ప్రారంభించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ భారీ బ్యానర్‌ను చేత పట్టి కాంగ్రెస్‌తో పాటు సీపీఐ, జేడీయూ, సీపీఎం,ఆమ్ అద్మీపార్టీల ఎంపీలు నిరసనలకు దిగారు. విజయ్ చౌక్ వద్ద వీరి ప్రదర్శనను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. నిరసనలు చేస్తున్న ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు.

గత కొన్ని రోజులుగా అదానీ- హిండెన్‌బర్గ్ వ్యవహారంపై జేపీసీతో విచారణ జరిపించాలని విపక్షాలు గొడవ చేస్తున్నాయి. పార్లమెంటులో చర్చలు సాఫీగా జరగనీయకుండా అడ్డుకోవడంతో సభలు వాయిదాలు పడుతున్నాయి. దీనితో పార్లమెంట్‌లో మొదలు పెట్టిన ర్యాలీలు రాష్ట్రపతి భవన్ వరకూ ప్రదర్శనలతో ప్రతిపక్ష ఎంపీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

