ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ
ఢిల్లీ టూర్ లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. నామినేటెడ్ పదవులు, మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కొత్త కార్యవర్గం, సంస్థాగత వ్యవహారాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం ఇటీవల అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆయనతోనూ పలు అంశాలపై చర్చించారని సమాచారం.