ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. విజ్ఞాన్ భవన్ లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన నేడు జరగబోయే సమావేశంలో పాల్గొన్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత (LWE) రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ వి.శివధర్ రెడ్డి,ఎస్ ఐ బీ ఐజీ బి.సుమతి హాజరయ్యారు