Home Page SliderTelanganatelangana,

అక్రమ నిర్మాణాలు కూల్చేసిన డిఫెన్స్ అధికారులు..

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బోయిన్‌పల్లిలో మూడు ఎకరాలలో ఉన్న అక్రమ నిర్మాణాలపై రక్షణ శాఖ, కంటోన్మెంట్ అధికారులు చర్యలు చేపట్టారు. అక్కడి అక్రమ నిర్మాణాలను డిఫెన్స్ అధికారులు, బోర్డు ఇంజినీర్లు కలిసి కూల్చివేశారు. రక్షణ శాఖ బీ3 కేటగిరీకి చెందిన బంగ్లాలో కూడా అక్రమ నిర్మాణాలు గుర్తించారు. ప్రైవేట్ సంస్థకు చెందిన రాజీవ్ గాంధీ ఏవియేషన్ అకాడమీ భవనాన్ని,  రక్షణ శాఖ భూములలోని కేబుల్ వైర్ల గోదాముని కూల్చివేశారు.