Andhra PradeshHome Page Slider

అవినాష్ రెడ్డిని ఓడించి, న్యాయాన్ని గెలిపించాలి: వైఎస్ వివేక కుమార్తె సునీత

జగన్‌పై ఈడీ, సీబీఐ కేసుల్లో విచారణలో జాప్యం జరుగుతోందన్నారు వైఎస్ వివేక కుమార్తె సునీత. దశాబ్దాల తర్వాత శిక్షలు పడినా న్యాయం జరిగినట్టు అని నేను అనుకోవడం లేదన్నారు సునీత. ఈ పోరాటంలో ఎవరినైనా కలుస్తాను. ఏ పార్టీ నేతలనైనా కలుస్తానని ఆమె స్పష్టం చేశారు. బీజేపీ, టీడీపీ, వైసీపీ, కమ్యూనిస్టులు ఎవరినైనా కలుస్తానన్నారు. షర్మిలను కడప నుంచి పోటీ చేయాలని వివేకా ఒత్తిడి చేశారన్నారు. కడప ఎంపీ సీటు మా కుటుంబానికి ఎంత కీలకం అనేది చాలా మందికి తెలియదన్నారు సునీత. నాకు లబ్ధి చేకూర్చాలని ఎవరినీ కోరను. న్యాయం కోసమే నేను పోరాటం చేస్తున్నానన్నారు. దేశంలో అనేక స్కామ్‌లు చూస్తున్నాం. 2జీ స్కామ్ ఇప్పటికీ తేలలేన్నారు. కానీ వివేక హత్య కేసులో సీబీఐ కొంత వేగంగా పనిచేస్తోందని ఆమె అన్నారు.

కడపలో ఖూనీలు, హత్యలు జరుగుతుంటాయని నా చిన్నతనంలోనే వినేదాన్ని అన్న సునీత, వినడమే తప్ప ప్రత్యేక్షంగా ఎప్పుడూ చూడలేదన్నారు. నాన్న హత్యపై ఐదేళ్ల పోరాటంలో ఎన్ని కష్టాలుంటాయో నాకు అర్థమైందన్నారు. తన వెనుక ఎలాంటి రాజకీయ పార్టీలు లేవన్నారు. నేను నా కోసమే పోరాటం చేస్తున్నా.. నా వెనుక పార్టీలు కాదు.. రాష్ట్రమంతా ఉందని భావిస్తున్నానన్నారు. తనకు చదువు, తెలివి, స్తోమత ఉన్నా ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నానన్నారు. సామాన్యులు పోరాటం చేయడం ఎంత కష్టమో అర్థమయ్యిందన్నారు. తాను పోరాటం చేస్తోంది కేవలం తన కోసం కాదని.. సామాన్యులందరి కోసమని ఆమె చెప్పారు. సామాన్యులు న్యాయం సాధించగలరని నిరూపించేందుకు ఈ పోరాటం చేస్తున్నానన్నారు.

కుటుంబంలోని వారే హత్య చేశారన్న విషయాన్ని తాను మొదట నమ్మలేదన్నారు సునీత. నా కుటుంబంలో అందరూ నాలాగే ఉంటారని భావించానన్నారు. కుటుంబంలోని వారందరినీ సంపూర్ణంగా విశ్వసించడమే చేసిన పోరపాటన్నారు. అవినాష్ తో విభేదాలున్నా కొడుకు జగన్ గెలవాలన్న పట్టుదలతో పార్టీ కోసం వివేకా పనిచేశారన్నారు. అవినాష్ రెడ్డి అధికారంలోకి రాకూడదనే తన ప్రయత్నమన్నారు. నిజాలు చెప్పాల్సిన బాధ్యత తనదని.. ప్రజలు భవిష్యత్ నిర్ణయిస్తారన్నారు. ప్రజలను జాగృతి చేయాల్సిన బాధ్యత తనదన్నారు. దస్తగిరి అంశం తనకు సంబంధించినది కాదని ఆమె చెప్పారు.