భారత్‌తో ఓటమి..ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ సంచలన నిర్ణయం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్‌లో భారత్ చేతిలో ఓటమి పాలయిన ఆస్ట్రేలియాకు మరో దెబ్బ తగలనుంది. ఆస్ట్రేలియా టీమ్‌నుండి స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(35) వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నారు. అసీస్ పరాజయం అనంతరం స్మిత్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే టెస్టు క్రికెట్, టీ20లలో కొనసాగుతానని పేర్కొన్నారు. అయితే తన నిర్ణయాన్ని టీమిండియా స్టార్ విరాట్ కోహ్లికి ముందుగానే తెలియజేసినట్లు తెలుస్తోంది. సెమీస్‌లో మ్యాచ్ విజయానంతరం కోహ్లి స్మిత్‌ను ఈ విషయంపై ప్రశ్నించినట్లు సమాచారం. మైదానంలో ప్రత్యర్థులైనా కోహ్లి- స్మిత్‌ల మధ్య వ్యక్తిగతంగా స్నేహబంధం ఉందని అభిమానులు పేర్కొంటున్నారు. పలుమార్లు వీరిద్దరూ ఒకరికొకరు ప్రశంసించుకున్నారు.

