Home Page SliderNationalNewsSportsTrending Today

తీవ్ర విషాదం…కోహ్లి, అనుష్కల ట్వీట్స్..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 18వ సీజన్ విజేతగా నిలిచింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదీస్తూ ఛాంపియన్ గా మారిన ఆర్సీబీకి ఘన స్వాగతం పలికేందుకు కర్ణాటక ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే భారీ ఎత్తున అభిమానులు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుని 11 మంది మృతి చెందగా.. 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై సర్వత్రా తీవ్ర విచారం వ్యక్తమైంది. విరాట్ కోహ్లి ఈ ఘటనపై స్పందించాడు. తొక్కిసలాట ఘటనతో మాటలు రావట్లేదని, తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అతని భార్య అనుష్క కూడా ఈ ఘటనతో మనసు కలచి వేసిందని పోస్టు పెట్టారు. భద్రంగా ఉండండి ప్లీజ్ అంటూ పోస్టు చేశారు. ఈ ఘటన తర్వాత కూడా ఆర్సీబీ చిన్న స్వామి స్టేడియంలో విజయోత్సవాలు నిర్వహించడం పలు విమర్శలకు తావిచ్చింది. అయితే విరాట్ కోహ్లి, ఇతర క్రికెటర్లకు జరిగిన వెంటనే విషయం తెలియకపోయి ఉండొచ్చని మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ అభిప్రాయపడ్డారు.