Home Page SliderNational

ప్రభాస్‌ను ఆటపట్టించిన దీపికాపదుకొనే

నిన్న ముంబయిలో జరిగిన ‘కల్కి’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో సరదా సంఘటన జరిగింది. హీరో ప్రభాస్‌ను బాలీవుడ్ హీరోయిన్ దీపిక ఆటపట్టించింది. హీరో ప్రభాస్ సాధారణంగా మితభాషి. ఎక్కువగా ఈవెంట్లలో మాట్లాడడు. కానీ ఈ కల్కి ఈవెంట్లో చాలాసేపు మాట్లాడడంతో ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటూ ప్రభాస్‌ను ఆటపట్టించింది దీపికా పదుకొనే. ఈ కార్యక్రమంలో ప్రభాస్, దీపికలతో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హసన్ వంటి హేమాహేమీలు పాల్గొన్నారు. నిర్మాతలు అశ్వినీదత్, స్వప్నదత్, ప్రియాంక దత్, దర్శకుడు నాగ్ అశ్విన్ పాల్గొన్నారు. హోస్ట్‌గా హీరో రానా వ్యవహరించి నవ్వులు పూయించారు. అమితాబ్, కమల్ వంటి ఉత్తమ నటులతో కలిసి నటించడం తన అదృష్టమని ప్రభాస్ మాట్లాడారు. దీపిక మాట్లాడుతూ ప్రభాస్ ఇంటి నుంచి రుచికరమైన భోజనం అందరికీ వచ్చేదని, అది తినే తాను షేప్ మారానని సరదాగా అన్నారు. దీపిక ప్రెగ్నెంట్ కావడంతో మెట్లు దిగబోతుండగా హీరో ప్రభాస్ చేయందించారు. దీనితో ప్రభాస్ మంచి మనసున్న వ్యక్తి అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.