home page sliderHome Page SliderTelangana

తెలంగాణలో చెప్పులపై చర్చ

అప్పు కోసం పోతే నన్ను దొంగని చూసినట్టు చూస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకు పోతాడేమోనని తనకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని సీఎం వాపోయారు. నన్ను ఎవరూ బజారులో నమ్మడం లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఇప్పుడు చెప్పులు ఎత్తుకుపోయే దాని మీద చర్చ నడుస్తుందని ఎద్దేవా చేశారు. చెప్పులు ఎత్తుకు పోవడం కాంగ్రెస్ పార్టీ కల్చర్ అని ఫైర్ అయ్యారు. చెప్పులు ఎత్తుకపోయేవాడి లాగా రేవంత్ రెడ్డిని ఎవరు చూశారని బండి సంజయ్ చెప్పాలన్నారు. సీఎం లెక్కలేనన్నిసార్లు ప్రధానిని కలిసారు. లెక్కలేనన్నిసార్లు కేంద్రమంత్రులను కలిసారు. పైగా సీఎంకు అపాయిమెంట్ ఇవ్వడం లేదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు బండి సంజయ్.