Home Page SliderNational

తమిళనాడు కల్తీమద్యం ట్రాజెడీలో 53కు చేరిన మృతుల సంఖ్య

తమిళనాడు కల్తీమద్యం ట్రాజెడీలో మృతుల సంఖ్య 53కు చేరింది. వీరిలో 5 మంది మహిళలు,ఒక ట్రాన్స్‌జెండర్ కూడా ఉన్నారు. కరుణాపురంలోని కల్లకురిచ్చి కల్తీమద్యం తాగి 141 మంది ఇంకా ఆసుపత్రులలో వైద్యసహాయం పొందుతున్నారు. వీరిలో మరికొందరు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే చనిపోయిన వారికి రూ.10 లక్షలు ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. ఈ ఘటనకు బాధ్యతగా జిల్లా ఎస్పీని సస్పెండ్ చేశారు. కలెక్టరును బదిలీ చేసిన సంగతి తెలిసిందే.