మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం-29 మంది మృతి
మెక్సికో సిటీ నుండి సౌత్ ఓక్సాకా స్టేట్‌కు వెళ్తున్న ఒక బస్సు ఘోర ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో 29 మంది చనిపోయారు. వీరిలో ఒక ఒకటిన్నర సంవత్సరం వయస్సు గల పసిబాలుడు కూడా ఉన్నట్లు సమాచారం. 20 మంది వరకూ తీవ్ర గాయాల పాలయ్యారు. గురువారం ఉదయం 6గంటల ప్రాంతంలో బస్సు డ్రైవర్ బస్సుపై కంట్రోల్ కోల్పోయి యాక్సిడెంట్‌కు గురయ్యి, దగ్గరలోని 25 మీటర్ల లోతులోని లోయలో పడిపోయింది. ఈ బస్సులో రోజువారీ కూలీలు వారి స్వగ్రామాలకు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించే ఏర్పాట్లు చేస్తున్నారు. క్షతగాత్రులకు సమీప ఆసుపత్రులలో చికిత్స అందజేస్తున్నారు.