కాంగోలో ఘోర పడవ ప్రమాదం.. 50 మంది మృతి
మధ్య ఆఫ్రికా దేశం కాంగోలోని మబండక సమీపంలోని నదిలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. 400 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగి 50 మందికి పైగా మృతి చెందారు. పలువురు గల్లంతు అయ్యారు. గల్లంతైన వారిని అధికారులు గాలిస్తున్నారు. పడవలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పడవ నదిలో మునిగిపోయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు.