Andhra PradeshHome Page Slider

పార్శిల్‌లో డెడ్ బాడీ..

పార్శిల్‌లో గుర్తుతెలియని మృతదేహం రావడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం క్షత్రియ సేవా సమితికి ఓ మహిళ దరఖాస్తు చేసుకున్నారు. మొదటి విడతలో సేవా సమితి టైల్స్‌ అందజేసింది. మరోసారి ఆర్థిక సాయం కోసం మహిళ దరఖాస్తు చేసుకోగా.. పార్శిల్‌లో విద్యుత్ సామగ్రికి బదులు మృతదేహం వచ్చింది. మృతదేహంతో పాటు ఓ ఉత్తరం కూడా ఉన్నట్లు గుర్తించారు. అందులో 1.30 కోట్ల రూపాయలను చెల్లించాలని, లేకపోతే ఇబ్బందులకు గురి చేస్తామని పేర్కొన్నారు. దీంతో ఆ మహిళ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ నయీం ఆజ్మీ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.