Home Page SliderTelangana

ఒకే చోట 50 కోతుల మృతదేహాలు..

వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాంతినగర్ సమీపంలో సుమారు 50 కోతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతదేహాలు కుప్పలు కుప్పలుగా ఒకే దగ్గర పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏదైనా విషపూరిత ఆహారం తిన్నాయా లేదా ఎవరైనా చంపేసి ఇక్కడికి తీసుకువచ్చి వేశారా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై అధికారులు స్పందించి నిజానిజాలను తేల్చాలని, నిజంగా మానవ ప్రమేయం ఉంటే బాధ్యులను కఠినంగా శిక్షించాలని స్థానికులు, హిందూ సంఘాల నాయకులు కోరుతున్నారు.