కువైట్ నుండి భారత్‌కు చేరిన మృతదేహాలు
కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో భారత్‌కు చెందిన 45 మంది కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. అయితే, వారి మృతదేహాలను భారత్‌కు తీసుకొచ్చారు. భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం శుక్రవారం ఉదయం కేరళలోని కొచ్చిన్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. కువైట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 12 మంది కేరళ వాసులు, ఏడుగురు తమిళనాడు వాసులు, ముగ్గురు ఏపీ వాసులు మృతి చెందారు.

