డీసీఎం బ్రేక్ ఫెయిల్.. ధ్వంసమైన పలు వాహనాలు..
హైదరాబాద్ హబ్సీగూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హబ్సిగూడ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బ్రేక్ ఫెయిల్ కావడంతో డీసీఎం లారీ.. మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. డీసీఎం డ్రైవర్, ద్విచక్ర వాహనాలపై ఉన్న నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దీంతో అక్కడ ఉన్న వాహనదారులకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రోడ్డుపై ఉన్న డీసీఎం లారీని క్రేన్ ల సహాయంతో తీసివేయడం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.