Home Page SlidermoviesNational

మోక్షజ్ఞ చిత్రానికి బాలీవుడ్ హీరోయిన్ కుమార్తె

నటసింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఖరారయిన సంగతి తెలిసిందే. హనుమాన్ డైరక్టర్ ప్రశాంత్ వర్మ డైరక్టర్‌గా ఫిక్స్ అయ్యారు. అయితే హీరోయిన్ ఎవరనేది ఆసక్తిగా మారింది. హీరోయిన్ కోసం చాలామందిని ఆడిషన్ చేయగా, ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె ఫిక్సయ్యిందట. రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని ఇప్పటికే ఆడిషన్ ఇచ్చారట. దీనితో ఆమె హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతోందని టాక్ నడుస్తోంది. గతంలో బాలకృష్ణ, రవీనా టాండన్ హీరో హీరోయిన్లుగా బంగారు బుల్లోడు సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.