ఈ నెల 27నుంచి OTTలో స్ట్రీమింగ్ కానున్న “దసరా”
నేచురల్ స్టార్ నాని,కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “దసరా”. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమా హీరో నాని కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దీంతో అభిమానులు ఈ సినిమా ఎప్పుడు OTT లోకి వస్తుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమా OTT రైట్స్‌ను భారీ మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. అయితే ఈ నెల 27 నుంచి దసరా మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తాజాగా ప్రకటించింది. మరి థియేటర్లలలో దుమ్ములేపిన దసరా మూవీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలో ఎటువంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాల్సివుంది.

