NewsTelangana

దానం దాదాగిరి… పోలీసులు ఏం చేశారంటే…

రిజిస్ట్రేషన్ లేని వాహనాలు, వెహికల్స్ కు బ్లాక్ ఫిల్మ్ అతికించడాన్ని కట్టడి చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు అధికార పార్టీ ఎమ్మెల్యే ముందు మాత్రం కళ్లు తేలేశారు. స్పెషల్ డ్రైవ్ అంటూ హడావుడి చేసిన నేతలు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో మాత్రం సైలెంట్ అయిపోయారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఎమ్మెల్యే దానం నాగేందర్ వాహనం కన్పించింది. TS09FA0999 వాహనాన్ని తనిఖీ చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే కారు అని చెప్పడంతో
వదిలేశారు. కారుపై ఇప్పటి వరకు 5 వేల రూపాయల చలానాలున్నా… పట్టించుకోకపోవడం విడ్డూరం. నిబంధనల పేరుతో సామాన్యులను వేధించే ట్రాఫిక్ పోలీసులు… అధికార పార్టీ ఎమ్మెల్యే విషయంలో ఇలా చేయడమేంటి సోషల్ మీడియాలో జనం మండిపడుతున్నారు. అధికార పార్టీకి ఓ న్యాయం… సామన్యులకు మరో న్యాయమా అంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.