Home Page SliderTelangana

సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్…!?

రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలేనంటారు. కానీ కొన్ని సార్లు కొందరికి జంపింగ్‌లు వరుస అవకాశాలు కల్పిస్తుంటాయ్. అలాంటి వారిలో దానం నాగేందర్ ఒకరు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సీట్ రాకపోవడంతో ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఎమ్మెల్యేగా గెలిచినా కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాడు వైఎస్సార్ అండగా తిరిగి ఆసిఫ్ నగర్ నుంచి పోటీ చేసినా ఎన్నికల్లో ఓడిపోయారు. అయినప్పటికీ వైఎస్ చలవతో కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. 2009లో గెలిచిన వెంటనే మంత్రి పదవి దక్కింది. వైఎస్సార్ మరణం తర్వాత కూడా తెలంగాణ కాంగ్రెస్ లో ఆయన కీలకంగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత దానం నాగేందర్ గులాబీ కండువా కప్పుకున్నారు. అయినప్పటికీ కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదన్న అక్కసుతో ఉండేవారు. చేసేదేం లేక సైలెంట్ గా ఉన్నారు. తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికార దక్కకపోవడంతో… ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

దానం నాగేందర్ ను సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అన్నీ తాను చూసుకుంటానని భరోసా కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ నుంచి 10కి పైగా స్థానాల్లో గెలవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకొంది. ఓవైపు బీజేపీ బలంగా ఉందనుకుంటున్న నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల్ని బరిలో దించాలని చూస్తోంది. ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ రాజీనామా చేసి, మల్కాజ్ గిరి నుంచి పోటీ చేస్తే రాజకీయాలు ఎలా ఉంటాయన్నది చూడాలి. దానం నాగేందర్ మొత్తానికి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే మంత్రి పదవి కూడా వస్తోందన్న భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది.

భారత రాష్ట్ర సమితి, బీఆర్‌ఎస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. నాగేందర్, వాస్తవానికి కాంగ్రెస్ నుండి 2018 లో BRS లో చేరారు. 2018, 2023 లో MLA గా గెలిచారు. నాగేందర్ రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్‌తో ప్రారంభించి, 1994 నుండి 2014 వరకు ఆసిఫ్‌నగర్ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.