గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా దాన కిశోర్
గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఐఏఎస్ దాన కిశోర్ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి తాజాగా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇది వరకు గవర్నర్ కార్యాలయం ముఖ్య కార్యదర్శిగా కొనసాగిన బుర్రా వెంకటేశం రిలీవ్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

