అక్రమ కేసులో దళిత నేతను అరెస్టు చేశారు..జగన్
గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేష్‌ను పరామర్శించారు వైసీపీ నేత జగన్. అనంతరం మీడియాతో మాట్లాడారు జగన్. మంగళగిరి టీడీపీ ఆఫీస్‌పై దాడిలో అసలు నందిగం సురేష్ ఎక్కడైనా సీసీ టీవీ ఫుటేజ్‌లో కనిపించారా అని ప్రశ్నించారు. అన్యాయంగా ఒక దళిత నేతను జైలులో పెట్టారని విమర్శించారు జగన్. చంద్రబాబు అన్యాయంగా తప్పుడు పనులు చేస్తున్నారనన్నారు. అధికారం శాశ్వతం కాదు. టీడీపీ నాయకులకు కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. విజయవాడ వరద పాపం చంద్రబాబుదే అని విమర్శించారు. ఆయన తన ఇంటిని కాపాడుకోవడానికి బుడమేరు గేట్లు ఎత్తారని, 60 మంది మరణాలకు కారణమయ్యారని మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజిని ఢీకొట్టిన బోట్ల విషయంలో రాజకీయం చేస్తున్నారని ఆబోట్లు టీడీపీకి చెందినవేనని పేర్కొన్నారు. ఈ బోట్ ఓనర్ ఉషాద్రి చంద్రబాబు, లోకేష్‌లతో ఫోటోలు దిగారని పేర్కొన్నారు. ప్రజలకు అబద్దాలు ప్రచారం చేస్తూ వైసీపీ నేతలపై తమ తప్పును నెట్టేస్తున్నారని ఆరోపించారు.