Home Page SliderTelangana

దళితులకు రక్షణ కవచంగా మారిన ‘దళితబంధు పథకం’

దళితులకు ఆర్థికపురోగతి సాధించే ఉద్దేశ్యంతో తెలంగాణా ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. 2021లో హుజూరాబాద్‌లో ప్రారంభమైంది ఈ దళితబంధు. ఈ పథకం ద్వారా స్వయంగా వ్యాపారం చేసుకోవడానికి, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ పథకం వాడుకోవచ్చు. 10లక్షలరూపాయలు చిన్న వ్యాపారులకు దళితబంధు పధకం ద్వారా ప్రభుత్వం ఇస్తుంది. దాదాపు ఈ పథకం ద్వారా రెండులక్షలమంది లబ్దిదారులు ఉన్నారని అంచనా. దళితులు స్వయంగా ఎదగడానికి యజమానులుగా మారడానికి ఉపయోగపడింది. ఈ దళితబంధు లబ్దిదారునికి పదివేల రూపాయల గ్యారంటీతో దళితరక్షణనిధిని కూడా ఏర్పాటు చేసింది. వారికి దీర్ఘకాల వ్యాధులు, ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడితే వారి కుటుంబాలకు కూడా ఉపయోగపడేలా ఈ రక్షణనిధిని వాడుకోవచ్చు.