ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి
బీజేపీ హైకమాండ్ పార్టీలో కీలక మార్పులు-చేర్పులు చేయడం ప్రారంభించింది. ఈ మేరకు ఏపీ బీజేపీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించాలని హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పదవికి తొలుత బీజేపీ సీనియర్ నేత సత్యకుమార్ పేరు వినిపించింది. అయినప్పటికీ అనుహ్యంగా దగ్గుబాటి పురంధేశ్వరిని హైకమాండ్ ఫైనల్ చేసింది. కాగా గతంలో పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా కేంద్రమంత్రిగా కూడా ఆమె పనిచేశారు. దీంతో ఆమె అనుభవం,ఎన్టీఆర్ వారసురాలు అనే పలు కీలక అంశాలను హైకమాండ్ పరిగణలోకి తీసుకుంది. ఈ విధంగా బీజేపీ పార్టీ చిన్నమ్మకు కొత్త బాధ్యతలు అప్పగించింది.