Home Page SliderInternational

జపాన్ లో దబిడి దిబిడి డాన్స్

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన ‘డాకుమహారాజ్’ సినిమాలోని ‘దబిడి దిబిడి’ సాంగ్ విపరీతంగా ట్రోల్ అయింది. లిరికల్ వీడియో విడుదల అవ్వగానే దీని కొరియోగ్రాఫీని చాలా మంది ప్రేక్షకులు ట్రోల్ చేశారు. కానీ ఈ పాటను ఇక్కడ కొడితే.. రీసౌండ్ జపాన్ లో వచ్చింది. జపాన్ లో ఓ డాన్స్ టీమ్ ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంది. ఈ వీడియోను నటి ఊర్వశీ రౌతేలా ఇన్ స్టాలో షేర్ చేశారు. దబిడి దిబిడి వరల్డ్ వైడ్ వ్యాపి చెందిందని ఆమె రాసుకొచ్చారు.