సోషల్ మీడియా ట్రోలర్స్‌కు సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక
సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ,ఫాలోయింగ్ కోసం కొందరు వ్యక్తులు సెలబ్రిటీలు,ప్రజాప్రతినిధులు,మహిళలను టార్గెట్ చేసుకుని వారిపై నిత్యం అసత్య ప్రచారాలను చేస్తుంటారు. అంతేకాకుండా వారి ఫోటోలను సహితం మార్ఫింగ్ చేస్తూ..వారిపై అసభ్యకర పోస్టింగ్‌లు పెడుతుంటారు. అయితే వీటి వల్ల సమాజంలో మహిళలు ,ప్రజాప్రతినిధులు,సెలబ్రిటీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కాగా సమాజంలో వారికి ఉన్న గౌరవ,మర్యాదలు దెబ్బతింటున్నాయి. వీటిని అరికట్టేందుకు గాను ఇకపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారికి కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ క్రైమ్ DCP స్నేహ మెహ్రా హెచ్చించారు. FB, ఇన్‌స్టాగ్రామ్,ట్విటర్,యూట్యూబ్‌లలో ట్రోలింగ్ చేసినా శిక్షార్హులని తెలిపారు. అయితే పెట్టే పోస్టులపై ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి కేసుల్లోనే ఇటీవల 20 మంది కేసులు నమోదు చేయగా,8మందిపై చర్యలు తీసుకున్నామని ఆమె వెల్లడించారు.

