ఐబొమ్మ రవిపై సైబర్‌క్రైమ్ అధికారి కీలక వ్యాఖ్యలు
పైరసీ కేసులో అరెస్టైన iBomma నిర్వాహకుడు ఇమ్మడి రవిపై సైబర్ క్రైమ్ అడిషనల్ CP శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రవికి కష్టపడి ఉద్యోగం చేయాలన్న ఆలోచనే లేకుండా సులభంగా డబ్బు సంపాదించాలని మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నాడని పేర్కొన్నారు.
“టెక్నాలజీ మీద పట్టు ఉంది. ఆ జ్ఞానాన్ని దుర్వినియోగం చేసి సినిమాలను పైరసీ చేశాడు. ఈజీ మనీ కోసం రవి ఈ మార్గం ఎంచుకున్నాడు. అతని ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే అతను మా కళ్లలో పడ్డాడు” అని ఆయన తెలిపారు.
రవిని అతడి భార్య ఇచ్చిన సమాచారంతో అదుపులోకి తీసుకున్నామని వస్తున్న వార్తలు అసత్యమని శ్రీనివాస్ ఖండించారు.
అదేవిధంగా రవి బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రచారం ద్వారా దాదాపు ₹20 కోట్ల వరకు సంపాదించాడని తెలిపారు.
దేశవ్యాప్తంగా పనిచేస్తున్న Movierulz, TamilMV వంటి పలు పైరసీ సైట్ల నిర్వాహకులను కూడా త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.
సినీ పరిశ్రమను దెబ్బతీసే పైరసీపై కఠిన చర్యలు తప్పవన్నదే తమ ధోరణి అని స్పష్టం చేశారు.

